చావో రేవో తేల్చుకుంటా అని అంటుంటారు... అసలు దాని అర్థమేమిటో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ఈ మాట మనం అప్పుడప్పుడు వింటుంటాం. చాలా మంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా ఇతర పలు సందర్భాల్లో చావో రేవో తేల్చుకుంటా...What is behind of Challenging words

Update: 2022-06-23 02:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ మాట మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా ఇతర పలు సందర్భాల్లో చావో రేవో తేల్చుకుంటా అని అంటుంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు. దీని వెనుక ఉన్న అర్థమేమిటో చాలామందికి తెలియదు. చావో రేవో అంటే సముద్రంలో చిక్కుకుపోవడం. అనగా సమస్యలు. ఆ సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు భయపడి ముడుచుకుపోతే మిగిలేది చావే. అలాంటి విపత్కార సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు దూకడమే. ఎలాగు చావు తప్పదనుకున్నప్పుడు తెగిస్తే రేవు చేరవచ్చు. అనగా సమస్యల నుంచి బయటపడడం. రేవు అంటే మన సమస్యలను అధిగమించడం.. గమ్యాన్ని చేరడం. ఇలా తెగించి కార్యాన్ని చక్కబెట్టుకుంటే వారి వారి కుటుంబాలకు వెదలు ఉండవు అని అర్థం.

Similar News