ధరణి సమస్యలు తీర్చకుంటే బతుకులుండవ్.. ట్విట్టర్‌లో బాధితుల వార్నింగ్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2022-03-30 14:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'ధరణి' పోర్టల్‌లో తమ భూమి వేరొకరి పేరిట చూయిస్తూందంటూ ఎన్నో ఫిర్యాదులు కలెక్టర్ల దృష్టికి వచ్చాయి. కానీ, ఎలాంటి సాయం చేయకపోవడంతో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. కొన్ని సమస్యలపై కలెక్టర్లు రివ్యూ చేసిన విషయం తెలిసిందే. అయితే, ధరణి పోర్టల్ బాధితులంతా కలిసి ''ధరణి పోర్టల్ బాధితులు'' పేరిట ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం తెలపాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ''ధరణి పోర్టల్‌లోని లోపాలతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నరు.. అని మరోసారి గుర్తుచేస్తున్నామ్. మీరు ఎంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరిస్తే అంత మంచిది. లేకుంటే మీకు బతుకులు ఉండవ్ అని కల్వకుంట్ల వారికి తెలియజేస్తున్నం. (ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయిర్రు, జర భద్రం)'' అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News