Margaret Alva: టీఆర్‌ఎస్‌ ఎంపీలతో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి భేటీ..

Vice Presidential Candidate Margaret Alva to Meet TRS MP's| విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు ఇంట్లో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు

Update: 2022-08-05 08:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: Vice Presidential Candidate Margaret Alva to Meet TRS MP's| విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు ఇంట్లో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో, శనివారం జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎంపీలు అల్వాకు ఓటేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ భవనంలో జరగనుంది. రహస్య బ్యాలెట్ విధానంలో జరుగనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం కౌంటింగ్​ నిర్వహించి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్​ఖడ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. దాసోజు శ్రవణ్ రాజీనామా!

Tags:    

Similar News