Telangana News : సీఎం కేసీఆర్‌కు ప్రశ్నల వర్షం.. నెల గడుస్తున్న వాటి జాడే లేదు!

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ- Latest Telugu News

Update: 2022-04-09 12:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగనోటిఫికేషన్ల కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని టీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేయగా.. తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. అయితే, తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుద్యోగులంతా సంతోషించారు. కానీ, భర్తీ చేస్తామని చెప్పినా ఇంకా ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. అయితే, దీనిపై యువజన కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నేటితో నెల రోజులైందని నోటిఫికేషన్లు ఏమైనాయి సారు ? అంటూ సీఎం కేసీఆర్‌‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా, నిరుద్యోగులు కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ 80,039 జాబ్స్ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News