Twinkle Khanna: బాల్కనీ నుంచి పొరుగువారిపై నిఘా.. ఆ హీరోయిన్ వీడియో వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా అభిమానులకు ఓ బ్యూటీఫుల్ మెసేజ్ ఇచ్చింది.
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా అభిమానులకు ఓ బ్యూటీఫుల్ మెసేజ్ ఇచ్చింది. యూట్యూబ్ వీడియో ద్వారా ఇంటి అలంకరణకు సంబంధించిన చిట్కాలను పంచుకుంది. బాల్కనీ గార్డెనింగ్‌లో కాఫీ లేదా డ్రింక్‌ని ఆస్వాదించాలంటే ఏం చేయాలి?.. పొరుగువారిపై ఎలా నిఘా పెట్టాలని సూచించింది. పుస్తకాలు, కొవ్వొత్తులు, ప్లాంట్ పాట్స్, కప్పులు, కాఫీ బాక్స్‌లను స్టాండ్‌పై అలంకరించిన నటి.. ఖాళీ ప్రదేశంలో విభిన్న రంగులతో కూడిన కొన్ని కళాఖండాలను హ్యాంగ్ చేసింది. అంతేకాదు ఇలా అలంకరించిన ప్రదేశంలో పిల్లలను కూర్చోబెట్టడం ద్వారా వాళ్ల మెదడులో పాజిటివిటీతోపాటు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపింది. అందమైన బాల్కనీ ఒత్తిడిలోనూ ప్రశాంతతను ఇస్తుందన్న ఆమె.. పుస్తకాలు బిగ్గరగా చదవడం ద్వారా ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను ఎంటర్టైన్ చేస్తానని, కానీ కుటుంబ సభ్యులకు మాత్రం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పింది.