నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ షాక్.. ఏఎంవీఐ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా!
అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ల భర్తీ ప్రక్రియలో నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ షాక్ ఇచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో : అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ల భర్తీ ప్రక్రియలో నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ షాక్ ఇచ్చింది. 113 పోస్టులకు శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకావాల్సి ఉండగా.. అత్యవసరంగా వాయిదా వేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో అప్లికేషన్లు తీసుకోవడం సాధ్యం కావడం లేదని గురువారం రాత్రి ప్రకటించారు. గ్రూప్ –1 దరఖాస్తుల ప్రక్రియ సందర్భంలో కూడా టీఎస్ పీఎస్సీ వెబ్సైట్ఇలాగే మొరాయించింది. పలు సందర్భాల్లో ఆగిపోయింది. తాజాగా ఈ నెల 5 నుంచి వచ్చేనెల 5 వరకు అసిస్టెంట్మోటారు వెహికిల్ఇన్ స్పెక్టర్పోస్టుల భర్తీలో భాగంగా తొలి దశలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్ లైన్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు వస్తున్నాయంటూ ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతానికి వాయిదా పడిందని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ప్రకటన విడుదల చేశారు