Vice President Elections: మద్దతు ఎవరికో తేల్చి చెప్పిన కేసీఆర్

TRS to Support Margaret Alva in Vice President Elections| ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు

Update: 2022-08-05 06:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: TRS to Support Margaret Alva in Vice President Elections| ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు విపక్షాల అభర్థి మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు. ఉప రాష్ట్రపతి పదవి కోసం ఆగస్టు 6న ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కించి ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా గతనెలలో జరిగి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: టెన్షన్ పెట్టిస్తోన్న జగ్గారెడ్డి మౌనం.. సన్నిహితుల్లో ఆసక్తికర చర్చ

Tags:    

Similar News