చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మ దగ్ధం

దిశ, నూగురు వెంకటాపురం: మండల పరిధిలో గల..Tribals hits out at Chinna Jeeyar swamy

Update: 2022-03-17 08:17 GMT

దిశ, నూగురు వెంకటాపురం: మండల పరిధిలో గల చొక్కాల గ్రామం దగ్గర వెంకటాపురం నుంచి చర్ల వెళ్లే రహదారిపై చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మకు ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క-సారలమ్మపై వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని.. లేనియెడల అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపకులు కొర్స నరసింహమూర్తి, వాసం నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు స్థానిక గిరిజనులు, గిరిజనేతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News