పోసానిపేట్ ఆలయంలో చోరీ

దిశ, రామారెడ్డి: రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో - Theft at Posani Pet Temple in Nizamabad district

Update: 2022-03-18 13:47 GMT

దిశ, రామారెడ్డి: రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో వెలిసిన శ్రీ గుడిగంటల రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామస్తులు, స్థానిక ఎస్సై భువనేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలుపులు, హుండీ తాళాలను పగులగొట్టి..దేవాలయ స్టోర్ రూమ్ లో గల రూ.60 వేల విలువగల మైక్ సెట్, రెండు అంప్లీఫైర్ సిస్టంలను, హుండీలోని నగదును కూడా దోచుకెళ్లారని తెలిపారు. క్లూస్ టీమ్ తో కూడా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ బండి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Tags:    

Similar News