Revanth Reddy: ఇక రంగంలోకి టీ కాంగ్రెస్.. భారీ యాక్షన్ ప్లాన్‌తో రేవంత్ సిద్ధం!

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు తమ పోరాటం ఆగదని- Latest Telugu News

Update: 2022-04-05 11:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు జరిపేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో పెంచిన కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6, 7 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఈనెల 6న రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు, 7వ తేదీన ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌద, సివిల్ సప్లై కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News