చెత్త రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఆర్సీబీ.. మరీ దారుణంగా..!

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,- latest Telugu news

Update: 2022-03-28 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన కిక్ ఇచ్చింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో విరోచితంగా పోరాడి చివరకు పంజాజ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఓ చెత్త రికార్డ్‌ను బ్రేక్ చేసింది. జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించిన ఆర్సీబీ బౌలర్లు ఏకంగా.. 39 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. కాగా, గతంలో ఎక్స్‌ట్రాల రూపంలో అత్యధిక పరుగులు(38) ఇచ్చిన రికార్డ్ డెక్కన్ చార్జర్స్ పేరిట ఉండేది. తాజాగా ఆర్సీబీ బౌలర్లు ఆ రికార్డ్‌ను అధిగమించారు.

Tags:    

Similar News