కోహ్లీ గురించి సంచలన విషయం బయటపెట్టిన మాజీ ఫిజియో..

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టు మాజీ ఫిజియో ఆశిష్ కౌశిక్.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి- latest Telugu news

Update: 2022-03-08 13:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత జట్టు మాజీ ఫిజియో ఆశిష్ కౌశిక్.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి సంచలన విషయం బయటపెట్టాడు. 2011 వరల్డ్ కప్ సెమీస్‌లో మొహాలీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ సమయంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మెడ, దవడ నొప్పితో బాధపడుతూ కూడా.. టీమిండియా కోసం నొప్పి భరించుకుని మ్యాచ్ ఆడాడని అప్పటి ఫిజియో ఆశిష్ కౌశిక్ వెల్లడించాడు. అంతే కాకుండా 'కోహ్లీ ప్రతి విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటాడని.. అతడి నొప్పిని తట్టుకునే శక్తి అసాధారణమైనదని తెలిపాడు. సమస్యల వచ్చినప్పుడు అద్భుత పరిష్కారాలు వెతకే సామర్థ్యం కోహ్లీకి ఉందని' పేర్కొన్నాడు.

Tags:    

Similar News