126 మందికి 'రైతు బంధు' కట్.. ప్రభుత్వాన్ని కోరిన ఎక్సైజ్ శాఖ

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు- latest Telugu news

Update: 2022-03-16 13:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్, పోలీసు అధికారులు గంజాయి వినియోగం, సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే, రైతులు సాగు చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ.. గంజాయి సాగు చేసే వారికి 'రైతుబంధు' నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో 126 మంది రైతులు గంజాయి పండిస్తుండగా అధికారులు పట్టుకొని వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల రైతులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గంజాయి సాగుచేసిన వారికి రైతుబంధు కట్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Tags:    

Similar News