టీఆర్ఎస్‌తో సంబంధం లేదు.. జెండా ఎలా కడతారు..?

దిశ, పాపన్నపేట: ఏదైనా ధర్నా - The erection of a black flag at the home of a former sarpanch who has nothing to do with the TRS party has drawn widespread criticism

Update: 2022-04-08 10:35 GMT

దిశ, పాపన్నపేట: ఏదైనా ధర్నా చేసిన, రాస్తారోకో చేసిన తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు ఉండాలి కానీ కొంతమంది అతిగా ప్రవర్తిస్తూ ఇష్టం లేని వ్యక్తులకు తమ మనోభావాలను అంటగడుతూ అధికార పార్టీ మన్ననలు పొందడం విడ్డూరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, నల్ల జెండాల ప్రదర్శనలు ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. తమకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని ఒక మాజీ సర్పంచ్ ఇంటికి నల్ల జెండా కట్టడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. పాపన్నపేట మండల పరిధిలోని కొత్త లింగయ్య పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వడ్ల సాయిబాబా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకి.. అతడు ఇంట్లో లేని సమయంలో స్థానిక నాయకులు అతని ఇంటికి నల్ల జెండా కట్టడం విమర్శలకు దారి తీస్తుంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి చెందిన ఒక ఉద్యోగితో నల్ల జెండా కట్టించడం విడ్డూరంగా ఉంది. తన ఇంటికి తమ అనుమతి లేకుండా వ్యతిరేక పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జెండా కట్టడం ఎంతవరకు సమంజసమని మాజీ సర్పంచ్ వడ్ల సాయిబాబా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని అలా కాకుండా అధికార పార్టీ నాయకులు తమ ఇష్టాన్ని ప్రతిపక్ష నాయకునిపై రుద్దడం ఎంతవరకు సమంజసం అంటూ సాయిబాబా ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News