ముఖ్యమంత్రిని కాల్చి చంపుతా.. మాజీ ఎమ్మెల్యే భార్య
దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ బెయిల్‌పై విడుదల అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ బెయిల్‌పై విడుదల అయ్యారు. విడుదల సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. ''లైంగిక వేధింపుల కేసు ఫేక్ అని అన్నారు. కేరళ సీఎం నా భర్తను, కుటుంబాన్ని హింసిస్తున్నారు. నా భర్త అమాయకుడు. కేరళ సీఎం అవినీతిని బయటపెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మా నాన్న రివాల్వర్‌తో సీఎంను కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని హెచ్చరించారు.'' అని మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌పై లైంగిక వేధింపుల కేసుపై ఆయన భార్య ఉషా జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.