టాలెంట్ ఉండాలి బ్రదర్.. విజయ్ దేవరకొండకు బండ్ల గణేశ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా 'లైగర్'.
దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా 'లైగర్'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. అభిమానులు తెగ సందడి చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద రౌడీ హీరో భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలభిషేకాలు చేసి రచ్చ చేశారు. అయితే అభిమానుల సందడి, రచ్చ చూసిన విజయ్ మెంటల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు.
''మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వరూ తెల్వదూ.. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయ్యింది. అది అంత చెప్పుకోతగ్గ సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయినా.. ఐ లవ్ యూ'' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే, విజయ్ టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి ఈ మాట అన్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. కాగా, తాజాగా విజయ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ''తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి.. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా టాలెంట్ ఉండాలి గుర్తుపెట్టుకో బ్రదర్'' అంటూ పోస్ట్ చేశాడు. అయితే, ఇది ఇండైరెక్ట్‌గా విజయ్‌కే కౌంటర్ ఇచ్చినట్లు ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022