పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్.. భారీగా నగదు పట్టివేత

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని..Six poker players arrested

Update: 2022-03-09 14:54 GMT

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన కుడిపూడి వెంకటేశ్వర్లు నివాసంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పేకాట ఆడుతున్న వ్యక్తులు కుడిపూడి వెంకటేశ్వర్లు, లావుజ్య బాలు, తాత రామయ్య, గువ్వల దుర్గ, గాజుల శ్రీనివాసరావు, ఏలూరి రామారావులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.51,800 నగదు, 6 సెల్ ఫోన్స్ లను స్వాధీనం చేసుకుని, అనంతరం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News