అమీర్ ఖాన్ విడాకులు.. ఆ నటి నుంచి లవ్ లెటర్.. ప్రొసీడ్ అవుతారా..?
దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ భార్యతో విడాకులు తీసుకున్నా.. Latest Telugu News..
దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ భార్యతో విడాకులు తీసుకున్నా ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లకు తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నటి షెఫాలీ షా ఓ సీక్రెట్ రివీల్ చేసింది. తను కాలేజీలో ఉన్నప్పుడు అమీర్ అంటే క్రష్ ఉండేదని తెలిపింది. అంతేకాదు తన లవ్ యాక్సెప్ట్ చేయమని.. అందంగా దిగిన ఫొటోతో పాటు ఓ లవ్ లెటర్ పంపించానని చెప్పింది.
అమీర్ నటించిన 'రంగేళి' సినిమాలో తాను కూడా ఉన్నానని, కానీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదని వివరించింది. కాగా తన అప్‌కమింగ్ మూవీ 'జల్సా' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించిన షెఫాలీ షా.. 'దీని గురించి మిస్టర్ పర్ఫెక్ట్కు తెలుసా?' అంటే 'ఏమో' అంటోంది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'విడాకులు అయ్యాయిగా.. ఇప్పుడు తెలుసుకుని రియాక్ట్ అవుతాడులే' అంటున్నారు.