నిత్యజీవిత సంఘటనలపై సాయిపల్లవి కొత్త చిత్రం

దిశ, సినిమా: గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం 'గార్గి'.

Update: 2022-07-12 11:15 GMT

దిశ, సినిమా: గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం 'గార్గి'. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సాయి ప‌ల్లవి మీడియాతో ముచ్చటించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే ఈ కథలో న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తోందని తెలిపింది. నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనలే తెరపై ఆవిష్కరించామని, అందుకే ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుందని చెప్పింది. ఇందులో తను టీచర్ పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కథ ముందుగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి వద్దకు వెళ్లినప్పటికీ ఆమె చేయకుండా తనకు అవకాశం ఇవ్వడం పట్ల హ్యాపీగా ఫీలైనట్లు తెలిపింది. ఆమె తన సోదరుడు, దర్శకుడు గౌతమ్‌తో కలిసి ఈ సినిమా నిర్మించింది. ఇక సినిమా చూశాక హీరో సూర్య తానే రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారని పేర్కొంది. కాగా తెలుగులో హీరో రానా సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Tags:    

Similar News