ప్రతి వారంలో ఆ రెండురోజులు 'రెవెన్యూ మేళా'

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో 'టాక్స్ రిడ్రెస్సల్ మేళా' మరియు..Revenue Mela at Jagittala Municipal Office

Update: 2022-03-06 14:43 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో 'టాక్స్ రిడ్రెస్సల్ మేళా' మరియు 'రెవెన్యూ మేళా' ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ జి. స్వరూప రాణి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఆస్థి పన్నుల్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నచో రివిజన్ పిటిషన్ చేసుకొనుటకు మరియు ఆస్థి పన్ను కట్టినా ఆన్లైన్ నందు అప్డేట్ కానివారి దరఖాస్తులను ప్రతి ఆదివారము, బుధవారం మున్సిపల్ కార్యాలయము నందు 'రెవెన్యు మేళా'లో ఉదయం 10.00 గంటల నుండి మధ్యానం 1.00 గంటల వరకు సమర్పించవచ్చని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలిపారు. పన్ను బకాయిదారులు బకాయిలు చెల్లించనిచో మున్సిపల్ ద్వారా జప్తూ వాహనము తిరుగుచున్న దృష్ట్యా మున్సిపల్ సిబ్బందికి సహకరించి సకాలంలో పన్ను చెల్లించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇట్టి మేళాలో ఏఈ ఆయుబ్ ఖాన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News