రవీంద్ర జడేజా తొలి విదేశీ సెంచరీ
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. అద్భుత సెంచరీ సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ తో
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. అద్భుత సెంచరీ సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో 33 ఏళ్ల జడేజా తన అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి విదేశీ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ మ్యాచ్ మొదటి రోజే టాప్ ఆర్డర్ కుప్పకూలి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెట్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ జడేజా.. గట్టెకించారు. రెండో రోజు 183 బంతుల్లో జడేజా సెంచరీ చేసాడు. దీంతో ఓవరాల్ గా జడేజా టెస్ట్ క్రికెట్ లో మూడు సెంచరీలు చేశాడు. దీంట్లో మొదటి రెండు సెంచరీలు ఇండియాలోనే రాజ్కొట్, మొహాలీలో చేశాడు.