మా నమ్మకం నిజమైంది.. 'ది వారియర్' సక్సెస్ మీట్‌లో రామ్

దిశ, సినిమా : యంగ్‌ హీరో రామ్ పోతినేని 'ది వారియర్' సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

Update: 2022-07-16 12:56 GMT

దిశ, సినిమా : యంగ్‌ హీరో రామ్ పోతినేని 'ది వారియర్' సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రబృందం సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో.. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు ఇబ్బంది పెడుతున్నా, ప్రజలు థియేటర్లకు వచ్చి తన చిత్రాన్ని ఆదరించినందుకు థాంక్స్ చెప్పాడు. అంతేకాదు తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని మరోసారి 'ది వారియర్'తో రుజువైందన్న హీరో.. లింగుస్వామితో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి ప్రాణం పెట్టి సినిమా చేశారని ప్రశంసలు కురిపించాడు. ఇక జూలై 14న విడుదలైన సూపర్ సక్సెస్‌ఫుల్ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.

Tags:    

Similar News