తెలంగాణ ధాన్యం కొనుగోలు పై స్పందించిన రాహుల్ గాంధీ

దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ధాన్యం కొనుగోలు విషయం పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా latest telugu news..

Update: 2022-03-29 04:39 GMT

దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ధాన్యం కొనుగోలు విషయం పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ''తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకు, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.'' అంటూ.. తెలుగులో రాసుకొచ్చారు.



Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News