వైద్యశాలకని వెళ్లిన యువతి అదృశ్యం!

Update: 2022-03-01 11:44 GMT

దిశ, కుత్బుల్లాపూర్: వైద్యశాలకని వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీకృష్ణనగర్‌కు చెందిన కన్నోజు రాజు కుమార్తె సాయిప్రసన్న(26) బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. అయితే గతనెల 28వ తేదీన ఉదయం డెంటల్‌కు సంబంధించిన చికిత్స కోసం వైద్యశాలకని వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ప్రయోజనంలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News