ఇకపై ఆ సేవలు నేను కొనసాగిస్తా.. ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ పవర్ స్టార్.. పునీత్ రాజ్‌‌కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం- latest Telugu news

Update: 2022-03-26 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ పవర్ స్టార్.. పునీత్ రాజ్‌‌కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. కన్నడ ప్రజలకు అప్పూగా సుపరిచితమైన పునీత్.. తన పౌండేషన్ ద్వారా ఎందరో పేద ప్రజలకు సహయం చేశాడు. నిరుపేద పిల్లలకు చదువు చెప్పించాడు. అనాథ విద్యార్థులకు, వృద్ధులకు ఆశ్రమాలు కట్టించడం వంటి ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేసి.. కన్నడ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. కాగా, పునీత్ అకాల మరణంతో ఆ సేవలకు కాస్త అంతరాయం ఏర్పడింది. దీనితో తమిళ స్టార్ హీరో విశాల్ వారి బాధ్యతలు తీసుకుంటానని చెప్పిన సంగతి విధితమే.

ఇదిలా ఉంటే తాజాగా.. టాలెంటెడ్ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా కీలక విషయం వెల్లడించాడు. అప్పూ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఓ పోస్టర్‌ను విడుదల చేసిన ప్రకాశ్ రాజ్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ తన పౌండేషన్ ద్వారా అందించిన సేవలను.. ఇకపై తన 'ప్రకాశ్ రాజ్' పౌండేషన్ ద్వారా వారికి సేవలు అందిస్తానని కీలక ప్రకటన చేశాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నాడు. దీనితో పునీత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News