Mumbai: ముంబైలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Orange alert issued in Mumbai By Meteorological| వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రవాణాపై ప్రభావం పడింది.

Update: 2022-07-05 10:36 GMT

ముంబై: Orange alert issued in Mumbai By Meteorological| వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రవాణాపై ప్రభావం పడింది. ముఖ్యంగా రోడ్లపైకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు దారి మళ్లించారు. మంగళవారం ఉదయం 8 గంటల వరకు నగరంలో సగటు వర్షపాతం 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఘట్కోపర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి, రోడ్డు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంధేరి, ఘట్కోపర్, చెంబూర్, పన్వెల్‌లలో కూడా వీధులు నీటితో నిండిపోయాయి. మరోవైపు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న భారీ వర్షాల దృష్ట్యా సీఎం ఏక్ నాథ్ షిండే సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితులను నియంత్రించేందుకు జిల్లా అధికారులను పర్యవేక్షించాలని ఆదేశించారు అని సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.



Tags:    

Similar News