దక్షిణ కొరియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కిమ్ చెల్లెలు

ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు- North Korea condemns South Korea's remarks on military ability, warns of destructive action

Update: 2022-04-03 14:59 GMT

ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు జారీ చేశారు. తమపై దాడి చేసే సాహసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కిమ్ సోదరి వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఇప్పటికే ఉత్తర కొరియా అనేక ఆయుధాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే.


అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉత్తర కొరియా ప్రయోగాలు చేయడం దక్షిణ కొరియాకు విసుగు తెప్పిస్తుంది. కాగా, శుక్రవారం దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి సూ వూక్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా తన పొరుగు దేశానికి వ్యతిరేకంగా క్షిపణులను ప్రయోగించాలని భావిస్తున్నట్లు గుర్తిస్తే, దానిపై ఖచ్చితమైన దాడులు చేసే సామర్థ్యంతో పాటు సంసిద్ధత తమ దేశానికి ఉందని చెప్పారు. దీనిపై కిమ్ సోదరి స్పందిస్తూ తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags:    

Similar News