Neeraj Chopra: ఫైనల్ చేరిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా..

Neeraj Chopra Sails into World Athletics Championships Final| వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఫైనల్ చేరాడు. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా

Update: 2022-07-22 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Neeraj Chopra Sails into World Athletics Championships Final| వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఫైనల్ చేరాడు. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.39 మీటర్ల దూరం విసిరాడు. గ్రూప్-ఏ‌లో అగ్రస్థానంలో నిలిచాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్‌కు చేరాడు. గ్రూప్-బీలో 80.42 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ సాధించాడు. అయితే 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించగా.. అందులో ఇద్దరు భారతీయులు ఉండటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. ఈ ఘనత సాధించిన రెండో భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కుతాడు. 2003 లో అంజూ బాబీ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం గెలిచింది.

ఇది కూడా చదవండి: 93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో అరుదైన రికార్డులు..


Tags:    

Similar News