జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భార్య జయలక్ష్మి మృతి

దిశ, నాచారం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కళా సూర్య కల్చరల్..latest telugu news

Update: 2022-03-19 15:07 GMT

దిశ, నాచారం: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అనుముల ప్రభాకర చారి సతీమణి జయలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు. కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్‌కు జయ లక్ష్మీ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కాలనీలో అందరితో కలివిడిగా ఉండే జయలక్ష్మి మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఆమె కుమారుడు శ్రీకర్ ఐఆర్ఎస్ అధికారి. ఆయన నివాసముంటున్న పిర్జాదిగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు . ఆమె మృతి పట్ల నాచారం కార్పొరేటర్ సాయి జన్ శాంతి శేఖర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News