నేడు ఉపరాష్ట్రపతి వీడ్కోలు విందు!

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ గురువారం 72 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు విందు ఇవ్వనున్నారు..telugu latest news

Update: 2022-03-30 11:46 GMT

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ గురువారం 72 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు సాంప్రదాయ వీడ్కోలు ప్రసంగాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి నివాసంలో నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ కార్యక్రమంలో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఎంపీలు కూడా ఉన్నారు. ఇక ఉపరాష్ట్రపతి పదవీకాలం కూడా ముగియనున్న సంగతి తెలిసిందే. కాగా, విందులో పలువురు రాజ్యసభ ఎంపీలు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. వీరిలో ఎంపీలు శాంతాను సేన్, డోలా సేన్ , తిరుచి శివ, రూపా గంగూలీ, వందనా చావన్, రామచంద్ర జాంగ్రాతో పాటు పలువరు ఎంపీలు తమ నైపుణ్యాలను చూపించనున్నట్లు తెలిపారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత పార్లమెంటు సభ్యులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News