బ్రేకింగ్ న్యూస్.. ఎంపీడీవో ఆఫీస్ దగ్ధం

దిశ, బెల్లంపల్లి: నెన్నెల మండల ఎంపీడీవో ఆఫీసు ప్రమాదవశాత్తు..MPDO office burned

Update: 2022-03-06 11:40 GMT

దిశ, బెల్లంపల్లి: నెన్నెల మండల ఎంపీడీవో ఆఫీస్ ఆదివారం అగ్నిప్రమాదానికి గురైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ తో కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఆఫీసులోని కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Tags:    

Similar News