Motorola నుంచి నాలుగు కెమెరాలతో G22 స్మార్ట్ ఫోన్..

Update: 2022-03-04 16:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: Motorola నుంచి సరికొత్త Moto G22 స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇది ప్రపంచ మార్కెట్లో విడుదలయింది. త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఫోన్ కాస్మిక్ బ్లాక్, పెరల్ వైట్, ఐస్‌బర్గ్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది 4GB RAM 64GB అంతర్గత మెమరీతో ఒకే వేరియంట్‌లో వస్తుంది.

Moto G22 స్పెసిఫికేషన్స్

-Moto G22 పంచ్-హోల్ డిస్‌ప్లే‌తో1600 x 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లేతో వస్తుంది.

-ఇది MediaTek Helio G37 SoC ద్వారా, Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

-ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, రెండు 2-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్‌లతో సహా క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

-సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, హోల్-పంచ్ లోపల 16-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

-5000mAh బ్యాటరీతో15W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

-దీని ధర దాదాపు రూ. 14,000.

-USB టైప్-C పోర్ట్ సపోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

-Side mounted ఫింగర్‌ఫ్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఉంది.

Tags:    

Similar News