పరిగి మండలంలో తల్లీకూతుళ్లు అదృశ్యం

దిశ, పరిగి : ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు..latest telugu news

Update: 2022-03-25 16:28 GMT

దిశ, పరిగి : ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబీకులు, పరిగి ఎస్ఐ పి.విఠల్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన శివగళ్ల నందకుమార్​, స్వప్న(23) భార్యాభర్తలు. స్వప్న ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఆమెతో పాటు 6 నెలల పాల (మిల్కి)నీ కూడా తీసుకొని వెళ్లింది. వాళ్లు బయటకెళ్ళి 13 రోజులవుతున్నా తిరిగి రాలేదు. ఈ క్రమంలో కుటుంబీకులు మాదారం, పరిగి తోపాటు బంధువులు, సన్నిహితుల ఇండ్లల్లో వెతికారు. కానీ ఎక్కడా ఆచూకి లభించలేదు. దీంతో కుటుంబీకులు పరిగి పోలీస్​ స్టేషన్ లో ఈ నెల 13వ తేదీన ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్​రెడ్డి తెలిపారు. ఆచూకి తెలిసిన వారు పరిగి ఎస్ఐ పి.విఠల్​రెడ్డి 9440627260 నెల్​ నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News