మోచేతి కెక్కిన అభిమానం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే టాటూ

దిశ, తుంగతుర్తి: అభిమానాలతో'పాటు ప్రేమలు పంచుకోవడం మొదటి నుండి చిత్ర వచిత్రాలుగా.. latest telugu news

Update: 2022-04-08 11:04 GMT

దిశ, తుంగతుర్తి: అభిమానాలతో'పాటు ప్రేమలు పంచుకోవడం మొదటి నుండి చిత్ర విచిత్రాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ఫ్యాషన్ టెక్నాలజీలో మరీ ఎక్కువగా మారింది. ఎటు తిరిగి సదరు అభిమానించే వ్యక్తి మదిలో చిరస్థాయిగా గుర్తింపు ఉండాలనేదే అంతిమ లక్ష్యం. ముఖ్యంగా రాజకీయపరంగా తమ నాయకునితో కూడిన ఫ్లెక్సీలు, తదితర వాటితో ప్రచారం చేసుకునే వారిని చూశాము. కానీ తుంగతుర్తి నియోజకవర్గం మాలిపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తాను అభిమానించే తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పై సరికొత్త తరహాలో కష్టంతో కూడుకున్న ప్రేమను ప్రదర్శించారు. మోచేతులపై కిషోర్ కుమార్ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకొని అభిమానాన్ని చూపెట్టు కొన్నారు. ప్రస్తుతం ఇది స్థానికంగా అందరిలో ఆసక్తికర చర్చగా మారింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News