టీఆర్ఎస్‌కు భారీ షాక్.. మరో సర్పంచ్ రాజీనామా ?

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని..Mattapalli Resign to sarpanch post?

Update: 2022-03-18 06:01 GMT

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామ సర్పంచ్ దాసరి విజయలక్ష్మి వెంకటరమణ పదవికి రాజీనామా చేయనున్నారు...! సర్పంచిగా గెలిచిన నాటి నుండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితుల ద్వారా సమాచారం. అందువల్లనే రాజీనామా యోచనలో ఉన్నట్టు ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి యాదయ్యకు వివరించినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో డీపీఓను కలిసి రాజీనామా లేఖను అందించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రాజకీయవర్గ విబేధాలే కారణామా...?

రాజకీయవర్గ విభేదాలే కారణమా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మఠంపల్లి మండలంలో అధికార పార్టీలో రెండు గ్రూపులుగా వీడారు. ఇందులో ఏ గ్రూపునకు అనుకూలంగా ఉన్నా మరొక గ్రూపువారు వారిని టార్గెట్ చేస్తుంటారు. ఈ వర్గ పోరులో ప్రస్తుతం రాజకీయం చేయలేమని.. సర్పంచ్ గా కొనసాగుతూ ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని భావించే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News