Viral Video: వైరల్‌గా మారిన నిమ్మరసం

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్స్, పండ్ల రసాలకు ఎవరూ నో చెప్పలేరు. దీనికి కారణం

Update: 2022-04-12 05:12 GMT

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్స్, పండ్ల రసాలకు ఎవరూ నో చెప్పలేరు. దీనికి కారణం స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ వారు అందించే రుచికరమైన రుచి ఒక్కటే కాదు.. వివిధ వ్యక్తులు అందించే ప్రత్యేక మార్గాలు అందరి దృష్టిని వారి వైపు తిప్పుకునేల చేస్తాయి. భారతదేశంలో ప్రతి వీధి వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మంచి మంచి మార్గాలను అన్వేశిస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే ఓ సోడా వ్యాపారి తన సూపర్ ఆలోచనతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు.

దీనికి సంభందించిన వీడియో ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ సోడా వ్యాపారి సోడా తయారికి ఎంచుకున్న మార్గం అందరిని మంత్రముగ్దులను చేస్తుంది. ఈ వీడియోలో అతను డ్యాన్స్ చేస్తూ.. నిమ్మకాయలు కోస్తూ.. మంచి పాటను రిథమ్‌లో పాడుతూ సోడా తయారిని చూపించాడు. దీనిని అతని వద్దకు వచ్చిన వినియోగ దారులు వీడియోలు తీస్తూ.. సోషల్ మీడియాలో.. పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సోడా వ్యాపారి వీడియో వైరల్ గా మారింది.

Tags:    

Similar News