నా కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారం బయట పెడుతా.. వనమా సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కుటుంబం ఆత్మహత్య కేసులో జైలు పాలైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: కుటుంబం ఆత్మహత్య కేసులో జైలు పాలైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే వనమా, తాజాగా కొడుకు విడుదలైన సందర్భంగా స్పందించారు. రెండు నెలలు అనారోగ్యంతో బాధపడ్డాను. నేను లేని సమయంలో నా కుమారుడిపై కుట్రలు పన్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాఘవా రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అనారోగ్యంతో లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. నా కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారం బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడిని ఆగం చేసిన వాళ్లలో మా పార్టీ వాళ్లతో పాటు ఇతర పార్టీల వారు కూడా కుమ్మక్కైయ్యారని అన్నారు. రాజకీయ కుట్రలు చూసి రాఘవపై ప్రజల్లో సింపతి పెరిగిందని తెలిపారు. రాఘవపై పెట్టిన కేసు నిలవదని అన్నారు.