Kangana Ranaut: నలుపు దుస్తుల్లో పిచ్చి గంతులు.. ఆ హీరోయిన్‌కు మంత్రాలు చేశారంట?

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అనుకున్నది అనుకున్నట్లుగా ఎక్స్‌ప్రెస్ చేయడంలోనూ

Update: 2022-04-12 08:49 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అనుకున్నది అనుకున్నట్లుగా ఎక్స్‌ప్రెస్ చేయడంలోనూ మహారాణినే. బీ టౌన్ నెపోటిజమ్‌పై విమర్శలు గుప్పించడంలో ఏ మాత్రం వెనక్కు తగ్గని కంగన.. చిన్న సినిమాల సక్సెస్‌పై నెపోటిజం బ్యాచ్ కాంప్లిమెంట్స్ ఇవ్వకపోయినా ఉతికారేస్తుంది. అలాంటి క్వీన్ ఓ పార్టీలో పిచ్చి గంతులేసిన థ్రో బ్యాక్ వీడియో ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో రెచ్చిపోయిన కంగన వ్యతిరేకులు.. నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ఇలాంటి వారినేనా పద్మశ్రీ, నేషనల్ అవార్డులతో సత్కరించేదని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లూ బ్లాక్ మ్యాజిక్ రూమర్స్ విన్నాం గానీ ఈ పిచ్చి చేష్టలు చూస్తే నిజమే అనిపిస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News