సాయం కోసం ఎదురు చూస్తున్న సరస్వతీ పుత్రుడు

దిశ, హుజురాబాద్ రూరల్: చదువే తన సర్వస్వం.. సరదాలు, సంతోషాలు సైతం..Huzurabad Student Clears NEET Exam; Urges For Financial Aid To Study Medicine

Update: 2022-03-12 12:00 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: చదువే తన సర్వస్వం.. సరదాలు, సంతోషాలు సైతం చదువులోనే. సమయం వృథాచేయకుండా చదువుపై దృష్టి సారించి ముందుకు సాగాడు. నీట్ లో ప్రతిభ కనబరచి మొదటి విడతలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన చిలుముల అంజి నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తన విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలో కొనసాగించాడు. పదో తరగతి వరకు నంది మేడారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ కరీంనగర్ లోని రుక్మాపూర్ లో పూర్తి చేశాడు. ఇంటర్ లో మొదటి నుంచి మొదటి స్థానంలో నిలిచాడు. మెడికల్ లో సీట్ సాధించాలని కసితో చదివాడు. ఒక సంవత్సరంపాటు నీట్ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాలలో 435 ర్యాంక్ రాగా సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కాగా కళాశాలలో ఫీజు చెల్లించే స్థోమత లేక దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సరస్వతీ పుత్రుడిని మంచి మనసున్న దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. యూనియన్ బ్యాంకు అకౌంట్ నెంబర్: 328302120011771 IFSC: UBIN0532835 కమలాపూర్ బ్రాంచ్. సెల్ నెంబర్ 9502260911 కు సహాయాన్ని అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Tags:    

Similar News