వృద్ధుడిపైకి ఎక్కించిన కారు.. స్టార్ హీరో డ్రైవర్ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: 58 ఏళ్ల వ్యక్తిని ఓ కారు తొక్కుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట.. Latest Telugu News..

Update: 2022-03-24 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: 58 ఏళ్ల వ్యక్తిని ఓ కారు తొక్కుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇన్నోవా కారు రోడ్డు మధ్యలో ఉన్న వికలాంగ వృద్ధుడిని తొక్కేసింది. చెన్నైలోని ఓ బిజీ రోడ్‌పై వికలాంగ వృద్ధుడు ఉన్నాడు. అదే సమయంలో కారు అతడి గుద్దుకుంటూ పోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కారు తమిళ హీరో శింబు, అతడి తండ్రికి చెందినది, ఘటన సమయంలో శింబు తండ్రి టీ రాజేందర్ కారులోనే ఉన్నారని సమాచారం అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా శింబు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News