అసభ్యకర కంటెంట్ వాడొద్దు: ఎఫ్ఎం ఛానెళ్లకు కేంద్రం ఆదేశాలు

Update: 2022-03-01 11:59 GMT

న్యూఢిల్లీ: కేంద్రం ఎఫ్ఎం రేడియో ఛానెళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఎం ఛానెళ్లలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఉపయోగించకుండా ఉండమని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 'పలు ఎఫ్ఎం ఛానెళ్లలో అసభ్యకరమైన, అభ్యంతర కంటెంట్ ప్రచారమవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చాలా మంది రేడియో జాకీలు ఉపయోగించే భాష ద్వంద్వ అర్థాలతో అభ్యంతరకరంగా ఉన్నట్లు గమనించాం. ఇది సరైన అభిరుచిలో లేకుండా తరచుగా పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వ్యాఖ్యలుగా ఉంటాయి' అని పేర్కొంది. అయితే అనుమతుల్లో ఉన్న నిబంధనలు ప్రకారం ప్రచారం చేసే సమాచారం న్యాయ నిబంధనలకు విరుద్ధంగా లేదని నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి సమాచారాన్ని చేరవేయడంలో ఛానెళ్లు విచక్షణతో పాటు సంయమనం పాటించాలని సూచించింది. ఏమైనా ఉల్లంఘన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Tags:    

Similar News