భారత్‌కు రుణపడి ఉంటాం: శ్రీలంక మాజీ క్రికెటర్

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఇండియా ఆదుకుంటోందని శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, అర్జున రణతుంగ అన్నారు.

Update: 2022-04-08 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఇండియా ఆదుకుంటోందని శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, అర్జున రణతుంగ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై ప్రసంశల వర్షం కురిపించారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు గాడి తప్పిన విషయం తెలిసిందే. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో భారత్ పెద్దన్నలా ఒక బిలియన్ డాలర్ల సహాయం అందిస్తూ, అలాగే 2,70,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని సరఫరా చేసింది. ఈ సందర్భంగా శ్రీలంక మాజీ క్రికెటర్లు స్పందించారు. ''శ్రీలంక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బతకడం చాలా కష్టం. ఇలాంటి సమయంలో భారత్ పెద్దన్నలా సహాయం చేయడం సంతోషంగా ఉంది. ఎప్పటికీ భారత్‌కు రుణపడి ఉంటాం. అలాగే, భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా సహాయం చేస్తే ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతామని జయసూర్య పేర్కొన్నాడు.

Tags:    

Similar News