ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్.. 80శాతం డిస్కౌంట్‌

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వరుసగా కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది..telugu latest news

Update: 2022-03-07 17:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వరుసగా కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను తీసుకొచ్చిన flipkart మరొక కొత్త ఆఫర్లతో రానుంది. మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లతో బిగ్ సేవింగ్ డేస్ (Big Saving days) ను తెచ్చింది. ఈ సేల్ మార్చి 12 నుంచి మార్చి 16 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ మొంబర్లకు మాత్రం ఒకరోజు ముందుగా మార్చి 11వ తేదీనే ఈ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్ టైంలో వినియోగదారులు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై 80శాతం డిస్కౌంట్‌లు పొందవచ్చు.

బిగ్ సేవింగ్ డేస్ సమయంలో ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా వస్తుంది.

Apple, Realme, Poco, Samsung ఫోన్‌లపై 80 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లు ఫిట్‌నెస్ బ్యాండ్‌ల వంటి ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది.

డీల్స్ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు జరుగుతాయి. ఇది మార్చి 12 వరకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అదనంగా TikTok డీల్‌లో భాగంగా, ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకు ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News