ఆయిల్ డిపోపై హౌతీ రెబెల్స్ దాడులు..

జెడ్డా: సౌదీ అరేబియాలో యెమెన్ హౌతీ రెబెల్స్ దాడులకు తెగబడ్డారు...telugu latest news

Update: 2022-03-25 17:35 GMT

జెడ్డా: సౌదీ అరేబియాలో యెమెన్ హౌతీ రెబెల్స్ దాడులకు తెగబడ్డారు. జెడ్డా ప్రాంతంలో ఎఫ్1 రేస్ కోర్టు పక్కనే ఉన్న డిపో పై దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హౌతీ రెబెల్స్ వెల్లడించారు. మేము డ్రోన్ల సహాయంతో బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, దాడులతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనిపై సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ స్పందించలేదు.

Tags:    

Similar News