నేను 'రెబల్‌'ను కాదు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రాజకీయాలపై టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2022-03-12 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రాజకీయాలపై టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. శనివారం మధిర టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి ''రెబల్''ని కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేసే ప్రసక్తే లేదని, నాకు పార్టీనే ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని.. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రజలకోసమే పనిచేస్తానని అన్నారు. కొందరు కావాలనే తనపై దుష్ప ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News