హోళీ వేడుకల్లో జూపల్లి బిజీ బిజీ.. బుల్లెట్ నడుపుతూ అందరినీ..

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ టౌన్ లో శుక్రవారం హోళీ పండుగ వేడుకలను..Ex Minister Jupally Participated in Holi Celebrations

Update: 2022-03-18 06:26 GMT

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ టౌన్ లో శుక్రవారం హోళీ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుల్లెట్ నడుపుతూ టౌన్ లో హోళీ వేడుకలో పాల్గొన్న జూపల్లి కృష్ణారావు ప్రజలను, ఉద్యోగులను, విశ్రాంత ఉద్యోగులను, యువతను, మహిళలను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురితో ప్రత్యేకంగా సమావేశమైన జూపల్లి పలు అంశాలపై చర్చించారు. ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:    

Similar News