Eatala Rajender: పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల సవాల్

Eatala Rajender Challenged 12 Congress MLAs who defected to TRS should resign and seek re-election| పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని

Update: 2022-08-08 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: Eatala Rajender Challenged 12 Congress MLAs who defected to TRS should resign and seek re-election| పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికకు రావాలంటే దమ్ముండాలని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే.. ఐదు నిమిషాల్లో ఆమోదించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి కొందరు టీఆర్ఎస్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లంతా దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.

ఈడీ కేసీఆర్ ఇంటి తలుపు తట్టడం ఎంతో దూరంలో లేదు

Tags:    

Similar News