ఆస్ట్రేలియాలో క్లీనింగ్ చేస్తే ఎంత జీతమో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఉద్యోగులు కేడర్, పని విధానం బట్టి వారికి వేతనాలు ఇస్తుంటాయి కంపెనీలు.

Update: 2022-07-21 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఉద్యోగులు కేడర్, పని విధానం బట్టి వారికి వేతనాలు ఇస్తుంటాయి కంపెనీలు. ఆయా కంపెనీలను బట్టి తక్కువ, ఎక్కువ ప్యాకేజీలు ఉంటాయి. అయితే ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు ఉద్యోగులకు భారీ వేతనం ప్యాకేజీలు ఇస్తున్నాయి. ఇంతకు ముందు గంటకు రూ.2700 ఇచ్చారు. ప్రస్తుతం దానిని రూ. 3600 వరకు పెంచారు. అత్యవసర సమయాల్లో రూ.4700 వరకు చెల్లిస్తున్నారు. దీంతో అక్కడ క్లీనింగ్ ఉద్యోగులు నెలకు రూ. 8-9 లక్షలు సంపాదిస్తునట్టు తెలుస్తోంది. అదే ఒక ఏడాదికి చూసుకుంటే రూ. 98 లక్షలు నుంచి రూ. కోటికి పైగా సంపాదిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ క్లీనింగ్ కూడా కేవలం తలుపులు, కిటికీలు మాత్రమే క్లీన్ చేయాల్సి ఉంటుంది.

Similar News