వెబ్‌సైట్లను వేధిస్తోన్న Google Analytics.. ఆందోళనలో కంటెంట్ క్రియేటర్స్

దిశ, వెబ్ డెస్క్: వెబ్సైట్లకు ప్రాణాధారం గా ఉన్న గూగుల్ అనలిటిక్స్ (Google Analytics) కంటెంట్ క్రియేటర్స్ ను

Update: 2022-04-07 15:39 GMT

దిశ, వెబ్ డెస్క్: వెబ్‌సైట్లకు ప్రాణాధారం గా ఉన్న గూగుల్ అనలిటిక్స్ (Google Analytics) కంటెంట్ క్రియేటర్స్ ను వేధిస్తోంది. రియల్ టైం ట్రాఫిక్ తప్పుగా చూపించడంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. తమ కంటెంట్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయో క్లారిటీ లేకపోవడంతో ఇబ్బంది కలవరపడుతున్నారు. దాదాపు 48 గంటల నుండి ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. ట్రాఫిక్ ఒకసారి ఎక్కువ చూపడం, ఒకసారి తక్కువ చూపడంతో కరెక్ట్ వ్యూస్ తెలియక అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై ట్విట్టర్, గూగుల్ అనలిటిక్స్ ఫోరమ్స్ కు కంప్లైంట్స్ ఇస్తున్నారు యూజర్లు. అయినప్పటికీ గూగుల్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొంతమంది నెటిజన్స్ గూగుల్ అనలిటిక్స్ త్వరలోనే రిటైర్ అవనుందని అందుకే ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తినా పట్టించుకోవడం లేదని కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News