సెల్‌టవర్‌ నిర్మాణం అగ్రిమెంట్‌ పేరుతో మోసం..

దిశ, టేకులపల్లి : ఐడియా టవర్ పెడతామని మోసం - Construction of cell tower in Bhadradri Kothagudem district is a fraud in the name of agreement

Update: 2022-08-05 14:52 GMT

దిశ, టేకులపల్లి : ఐడియా టవర్ పెడతామని మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు గోల్యాతండాకు చెందిన బానోత్ కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. మీ భూమి ఐడియా టవర్ పెట్టడానికి శాటిలైట్ ద్వారా ఓకే అయ్యిందని సైబర్ మోసగాళ్లు తెలిపారన్నారు. గత మూడు రోజులుగా ఫోన్ చేస్తూ.. వీఐ కంపెనీ ద్వారా మీకు అడ్వాన్స్ 20 లక్షలు, భూమి కౌలు సంవత్సరానికి 20 వేలు, కంపెనీలో జాబ్ ఇచ్చి ప్రతి నెల 15 వేలు ఇస్తామన్నారు.


అయితే ముందుగా కంపెనీకి 10 వేలు చెల్లించాలని చెప్పారని బాధితుడు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చి స్థానిక గోల్యాతండా సర్పంచ్ నిరోషా మంగీలాల్‌కి తెలపడంతో.. సర్పంచ్‌ సైబర్ నేరగాళ్లుతో మాట్లాడానికి ప్రయత్నించారు. కానీ సైబర్ నేరగాళ్లు సరైన సమాధానం ఇవ్వలేదు. ఐడియా కంపెనీ వారితో మాట్లాడగా.. ఎటువంటి టవర్ పెట్టడం లేదని మాకు సంబంధం లేదని తెలిపారు. దీంతో శుక్రవారం సైబర్ మోసగాళ్ళుపై కుమార్ టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెంట్ ఇచ్చాడు.

Similar News